telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

హెచ్ఐవి ఉందని దాచిన ప్రియుడు… ఆమె ఏం చేసిందంటే ?

Man

అమెరికాకు చెందిన ఓ వ్యక్తి నీచానికి ఒడిగట్టాడు. తనకు హెచ్‌ఐవీ ఉందనే నిజాన్ని దాచి, కొంతమంది యువతులతో లైంగిక చర్యలకు పాల్పడ్డాడు. వీరిలో ఓ యువతికి తాజాగా హెచ్‌ఐవీ సోకిందని తేలింది. దీంతో భయపడిపోయిన ఆమె.. పోలీసులను ఆశ్రయించింది. ఫ్లోరిడాకు చెందిన గెంటీ బర్న్స్‌(26)తో తాను 2013లో డేటింగ్ చేశానని, ఆ సమయంలోనే తనకు హెచ్‌ఐవీ సోకి ఉంటుందని ఫిర్యాదు చేసింది. గెంటీకి చాలామంది యువతులతో సంబంధాలున్నాయన్న ఆమె.. హెచ్‌ఐవీ ఉన్న విషయాన్ని అతను ఎవరికీ చెప్పలేదని, కాబట్టి తనలాంటి బాధితులు ఇంకా ఉండొచ్చని పేర్కొంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. గెంటీ వల్ల హెచ్‌ఐవీ సోకిన వారు మరెవరైనా ఉన్నారేమోనని దర్యాప్తు చేశారు. ఆ సమయంలో మరో యువతికి కూడా గెంటీ వల్ల ఈ వ్యాధి సోకినట్లు తేలింది. ఫ్లోరిడాలోని చట్టాల ప్రకారం.. హెచ్‌ఐవీ, గనేరియా వంటి సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్(లైంగిక కలయిక ద్వారా వ్యాప్తి చెందే) వ్యాధులు సోకినవారు, ఆ విషయాన్ని దాచి వేరేవారితో లైంగిక చర్యల్లో పాల్గొనడం తీవ్రమైన నేరం. వేరే కేసులో ఇప్పటికే జైల్లో ఉన్న గెంటీపై.. పోలీసులు ఈ కేసు కూడా నమోదు చేశారు. గెంటీతో సంబంధాలున్న మహిళలు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

Related posts