telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆ జంట డ్రగ్స్ కు బానిసై… ఏం చేశారంటే…!?

Florida

డ్రగ్స్‌కు బానిసలై ఫ్లోరిడాకు చెందిన భార్యాభర్తలు డబ్బు కోసం ఓ వృద్దుడిని బెదిరించి తన ఆస్తి మొత్తం కాజేశారు. మూడేళ్ల క్రితం తన పిల్లలకు తిండి పెట్టడానికి కూడా తన దగ్గర డబ్బుల్లేవని జెస్సికీ హెన్రీ (31) అనే యువతి వృద్దుడి సహాయం కోరడంతో ఆయన ఆర్థిక సహాయం చేశాడు. ఆరు నెలల తరువాత తాను ఓ కేసులో అరెస్ట్ అయ్యానని, ప్రొబేషన్‌లో భాగమైన యూరిన్ టెస్ట్‌లకు 350 డాలర్ల సహాయం చేయాలని మరోమారు కోరింది. అదే సమయంలో యువతి భర్త అయిన దూషన్ (28) ప్రొబేషన్ ఆఫీసర్‌గా నాటకమాడి ప్రతిరోజూ వృద్దుడి నుంచి 150 నుంచి 1000 డాలర్ల వరకు వసూలు చేస్తూ వచ్చాడు. కొద్దిరోజుల తరువాత వృద్దుడు ఎదురు తిరగడంతో డబ్బులు ఇవ్వకపోతే కారును స్వాధీనం చేసుకుంటానని, జైలులో పెడతానని దూషన్ బెదిరించాడు. ఇలా వృద్దుడి నుంచి దాదాపు లక్ష డాలర్ల(రూ.70 లక్షలు) వరకు డ్రగ్స్ కోసం భార్యాభర్తలిద్దరూ వసూలు చేశారు. ఇక వృద్దుడి బ్యాంక్ అకౌంట్‌లో చిల్లిగవ్వ లేకపోవడంతో వెటరన్స్ క్రైసిస్ సెంటర్‌కు ఫోన్ చేసిన వృద్దుడు జరిగిందంతా వివరించాడు. అనంతరం తనకు చావు తప్ప వేరే మార్గం కనిపించడం లేదని చెప్పి ఫోన్ పెట్టేసి ఆత్మహత్య చేసుకోబోయాడు. క్రైసిస్ సెంటర్ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వృద్దుడిని కాపాడి నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

Related posts