ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సమీపంలో వరద ఉధృతి పెరిగింది. కృష్ణా నదిలో వరద పోటెత్తడంతో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద కూడా వరద గంటగంటకు పెరుగుతోంది. నివాసంలోకి వరద నీరు రాకుండా ఉండేందుకు సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. స్టోన్ క్రష్, ఇసుక బస్తాలతో రక్షణ ఏర్పాటు చేస్తున్నారు. బాబు కాన్వాయ్‌ను హ్యాపీ రిసార్ట్స్‌కు తరలించారు. ఇంటి వెనుకవైపు ఇసుక బస్తాలు వేసి వరద నీటిని అడ్డుకుంటున్నారు.
ఇంట్లో కింది భాగంలో ఉన్న వస్తువులన్నింటినీ మేడపైకి తీసుకెళ్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి 4 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. దీంతో కృష్ణా కరకట్ట వైపు ఉన్న నివాసాలు ముంపునకు గురవుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరగడంతో 70 గేట్లు ఎత్తి నీరు సముద్రంలోకి విడిచిపెట్టారు.
జగన్ నిర్ణయంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి: కేశినేని నాని