telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వరద బాధితులకు రూ.10 కోట్ల సాయం.. ప్రకటించిన జగన్ ప్రభుత్వం!

jagan

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీలోని పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో చాలాచోట్ల పంటలు నీట మునిగాయి. ఆరుగాలం శ్రమించి అధిక పెట్టుబడులతో సాగుచేసిన పంటలు చేతికొచ్చే సమయంలో పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం బాధితులను ఆదుకునేందుకు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా గోదావరి జిల్లాలకు రూ.10 కోట్ల 9 లక్షల 20 వేల ప్రత్యేక వరద సాయాన్ని విడుదల చేసింది.ఈ మేరకు ఏపీ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది.

గోదావరి వరదల కారణంగా ఇళ్లు దెబ్బతిన్నవారికి రూ.5,000 అందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ నిధుల్లో రూ. 7,21,75,000 తూర్పు గోదావరి జిల్లాకు కేటాయించగా, మరో రూ. 2,87,45,000ను పశ్చిమ గోదావరి జిల్లాకు ఏపీ ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులను సంబంధిత లబ్ధిదారులకు వెంటనే అందించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.

Related posts