telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

విమానంలో లగేజ్ పెడదామనుకున్న అతనికి షాకిచ్చిన అమ్మాయి… !!

Plane

అమెరికాలోని నాష్‌విల్లె నుంచి ఫిలడెల్ఫియాకు బయలుదేరాడతను. సౌత్‌వెస్ట్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానం టికెట్ బుక్ చేసుకున్నాడు. ఎయిర్‌పోర్ట్ చేరుకున్నాడు. బోర్డింగ్ పాస్ తీసుకుని విమానం ఎక్కేశాడు. లగేజ్ పైన పెట్టడానికి కంపార్ట్‌మెంట్ తెరిచాడు. అంతే పెద్దగా కేకవేసి వెనక్కు దూకాడు. కారణం.. ఆ కంపార్ట్‌మెంట్లో ఓ అందమైన యువతి పడుకొని ఉండటమే. విషయం తెలుసుకున్న విమాన సిబ్బంది చిరునవ్వులు చిందించారు. అది తాము చేసిన చిన్న ప్రాంక్‌ అని చెప్పడంతో అతనూ నవ్వేశాడు. అతని లగేజ్ కంపార్ట్‌మెంట్లో దాదాపు 10 నిమిషాలు సందడి చేసిందా ఎయిర్‌హోస్టెస్. ఆమెను చూడటానికి, సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయాణికులు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ యాజమాన్యం.. తమ ప్రయాణికులకు ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని అందించడం కోసం సిబ్బంది అప్పుడప్పుడూ ఇలాంటి తమాషాలు చేస్తుంటారని తెలిపింది.

Related posts