telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

అవిసె గింజల పొడితో.. అధికబరువుకు చెక్.. !

flax seeds to control over weight

ఉద్యోగరీత్యా, లేదా పరీక్షల నిమిత్తమో.. రాత్రిపూట అధిక సమయం మేల్కొనే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే అలాంటివారిలో ఒబిసిటీ సమస్య తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిపోను నిద్ర లేకపోవడం అనేది కొవ్వును కరిగించే హార్మోన్ల పనితీరును ప్రభావితం చేస్తుంది. అంతేకాదు ఎక్కువగా ఆకలి వేస్తుంది. చక్కెర, కార్బోహైడ్రేట్స్‌ ఉన్న ఆహారం తినాలనిపిస్తుంది. అలసటకు కూడా కారణమవుతుంది. ఫలితంగా ఒబిసిటీ తప్పదు.

ఒబిసిటీ నుంచి బయటపడాలంటే.. అధిక బరువును తగ్గించుకోవాలంటే.. భోజనం చేయడానికి అరగంట లేదా గంట ముందు టీ స్పూను ఫైబర్‌ సప్లిమెంట్‌ పౌడర్‌ లేదా తాజా అవిసె గింజల పొడిని గ్లాసు నీళ్లలో కలుపుకొని తాగండి. దీనితో ఎక్కవ ఆకలి అనిపించదు. తక్కువ ఆహారం తీసుకుంటారు. మానసిక ఒత్తిడి వల్ల బరువు పెరుగుతుంది. అందుచేత ధ్యానం చేయడం, గట్టిగా శ్వాస తీసుకోవడం, కొన్ని నిమిషాలు చేతలు, కాళ్లను మసాజ్‌ చేసుకోవడం వల్ల ఒత్తిడి దూరమవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

flax seeds to control over weightభోజనం బదులు ప్రొటీన్‌ షేక్‌ తీసుకోవడం వల్ల అనవసరమైన కొవ్వు కరిగిపోతుంది. బాదం పాలలో ప్రొటీన్‌ పౌడర్‌, చక్కెర కలపని కొబ్బరి పాలు, తాజా అవిసె గింజల పొడి, ఆకుపచ్చ ఆకుకూరలు కలిపి తీసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Related posts