telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

16 ఏళ్ళ బాలుడిపై అత్యాచారం…

SIT Investigation YS viveka Murder

రానురానూ ఈ ప్రపంచంలో అబ్బాయిల నుంచి అమ్మాయిలకే కాదు… అబ్బాయిల నుంచి అబ్బాయిలకు కూడా రక్షణ లేకుండా పోతోంది. సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్ ద్వారా 20 ఏళ్ల ఓ యువకుడు బాలుడికి పరిచయమయ్యాడు. అలా కొన్ని రోజులు బాలుడితో చాట్ చేసిన అతడు ఏప్రిల్ 18వ తేదీన ఉదయం 6.15 గంటల ప్రాంతంలో బయట కలిసి మాట్లాడుకుందామని చెప్పాడు. అనంతరం అతడి ఐదుగురు స్నేహితులతో కలిసి వచ్చిన నిందితుడు బాలుడి ఇంటి సమీపంలో నుంచి కారులో తీసుకెళ్లారు. ఆ తరువాత ఓ విల్లాకు తీసుకెళ్లి అక్కడ కత్తితో బెదిరించి బాలుడిపై ఆ ఐదుగురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. మళ్లీ 8.30 గంటలకు తీసుకొచ్చి ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయారు. ఈ ఘటనతో భయపడిపోయిన బాధితుడు తనపై జరిగిన దారుణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ, బాలుడి స్కూల్‌మెట్ ఒకరు అతడిపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియో ఒకటి బయట చూశానని చెప్పాడు. అప్పుడు తనకు ఆ సమయంలో నిందితులు వీడియో తీసిన విషయం తెలిసిందన్నాడు. దాంతో ఈ విషయం బయటపడడం ఖాయమని భావించిన బాధిత బాలుడు మొదట తన సోదరుడితో తనపై జరిగిన దారుణం గురించి చెప్పాడు. రెండు రోజుల తరువాత అతడి తల్లిదండ్రులకు కూడా విషయం తెలియడంతో వారు అల్ ఖుసైస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి సమాచారం మేరకు ఏప్రిల్ 23వ తేదీ రాత్రి 7 గంటలకు ఐదుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన పోలీసులు ఏప్రిల్ 29న ఆ వీడియో చిత్రీకరించి ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకొని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌లో విచారించారు. ఆ తరువాత అతడి సమాచారంతో మిగతా నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు నిందితుల్లో ముగ్గురికి ఇంతకుముందే పురుషలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఫిర్యాదులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసు విచారణ మళ్లీ ఆగస్టు 4న కొనసాగనుంది.

Related posts