telugu navyamedia
క్రైమ్ వార్తలు

ఐదు రోజుల పసిపాపకు వాతలు

rape attempt on 5 years old baby
ముక్కుపచ్చలరాని ఐదు రోజుల పసిపాపకు నాటు వైద్యం పేరిట వాతలు పెట్టించి ఆ చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చారు. నిండా ఐదు రోజులైనా లేని పసిపాప అనారోగ్యం పాలైతే తల్లిదండ్రులు ఓ నాటు వైద్యుని ఆశ్రయించారు. వైద్యం పేరిట వాతలు పెట్టడంతో పరిస్థితి విషమించింది. వెంటనే ఆ పాపను ఆస్పత్రికి తరలించి సకాలంలో  వైద్యసేవలు అందిం చడంతో ప్రాణాపాయం తప్పింది. విజయనగరం జిల్లా  ఏజెన్సీలోని జనం మూఢ విశ్వాసాలకు అద్దం పట్టే ఈ సంఘటన తల్లిదండ్రుల అనుమతితోనే చోటుచేసుకోవడం విశేషం. 
వివరాల్లోకి వెళితే… పాచిపెంట మండలం ఊబిగుడ్డి గ్రామానికి చెందిన పాడి నరసమ్మ, శ్రీను దంపతులకు గతనెల 25న ఆడపిల్ల పుట్టింది. పూర్తి ఆరోగ్యంతో జన్మించిన చిన్నారిని సాలూరు ఆస్పత్రి నుంచి తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో స్వగ్రామం తీసుకెళ్లారు. 30న బిడ్డ పొట్టపై చిన్నచిన్న బొబ్బర్లు రావడాన్ని గుర్తించారు. వాతలు పెడితే తగ్గుతాయని గిరిజన పెద్దలు, కుటుంబ సభ్యులు చెప్పటంతో ఐదురోజుల ప్రాయంలోనే సూదిని బాగా కాల్చి చిన్నారి పొట్ట, చేతులపై వాతలు పెట్టారు.  దీంతో  నొప్పి భరించలేని చిన్నారి గుక్క తిప్పుకోకుండా ఏడుస్తుండడంతో సాలూరు ప్రభుత్వాసుపత్రిలో ఉన్న సిక్‌ నియోనెటల్‌ కేర్‌ సెంటర్‌లో మంగళవారం చేర్చారు. సకాలంలో వైద్యం అందటంతో చిన్నారికి ప్రాణహాని తప్పిందని వైద్యులు తెలిపారు.

Related posts