telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఫ్రంట్ కు అనుకూలం అంటున్న.. నవీన్ పట్నాయక్…

cm kcr red signal to 3 sitting mps

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయంగా ప్రాంతీయ పార్టీలతో కలిసి ముందడుగు వేయాలని, బీజేపీ-కాంగ్రెస్ యేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ సంకల్పించిన విషయం తెలిసిందే. దానికి ఆయన ఇప్పటికే కొన్ని రాష్ట్రాల లోని ప్రాంతీయ పార్టీల నేతలతో భేటీ కూడా అయ్యారు. ఈ భేటీలకు సానుకూల స్పందన తాజాగా వ్యక్తం కావడం విశేషం. దానిలో భాగంగా, బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న మహాకూటమిలో తాము చేరడం లేదని బిజూ జనతాదళ్ (బీజేడీ) అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఇప్పటి వరకు తాము దూరంగానే ఉంటూ వస్తున్నామని… ఇకపై కూడా తాము ఇదే విధానాన్ని కొనసాగిస్తామని నవీన్ పట్నాయక్ చెప్పారు. ఒడిశాలో మొత్తం 21 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బీజేపీ కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. బీజేడీ మిగిలిన 20 స్థానాలను గెలుచుకోగా… కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేకపోయిన విషయం తెలిసిందే.

Related posts