telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

చంద్రయాన్-2 తొలిదశ .. విజయవంతం.. విజయవంతంగా భూకక్ష్యలోకి ..

first stage of chandrayann-2 is successful

చంద్రయాన్-2 తొలిదశ విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది. శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-2.. చందమామపై అడుగుపెట్టాలనే భారతీయుల కలలను కూడా మోసుకెళ్లింది. చంద్రుడిపై భారత్‌కు ఇది రెండో మిషన్. జాబిల్లిపై అపోలో 11 వెళ్లి 50 యేళ్లైన సంబరాలు జరుపుకుటుంన్న సమయంలోనే భారత్ చంద్రయాన్-2ను విజయవంతంగా ప్రయోగించింది. భారత్ చంద్రయాన్-2ను ఇప్పటివరకూ ఎవరూ చేరని దక్షిణ ధ్రువానికి పంపింది. ఇది సెప్టంబర్ మొదటి వారంలో చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం చంద్రుడిపై ఉన్నఈ ప్రాంతం చాలా క్లిష్టమైనది. ఇక్కడ నీళ్లు, శిలాజాల ఆధారాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ల్యాండర్ అంటే దాని ద్వారా చంద్రుడిపైకి చేరే వాహనం. రోవర్ అంటే ఆ వాహనం నుంచి చంద్రుడి పైకి చేరుకుని, అక్కడ అన్వేషిస్తుంది. అంటే ల్యాండర్‌ రోవర్‌ను తీసుకుని చంద్రుడిపై దిగుతుంది. చంద్రయాన్-2 విజయవంతంగా భూకక్ష్యలోకి ప్రవేశించింది. ఇది అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగితే చంద్రుడి గురించి మరింత బాగా తెలుసుకోగలం అని ఇస్రో చెబుతోంది. ఇస్రో ఛైర్మన్ శివన్ “విక్రమ్ ల్యాండ్ అయ్యే సమయంలో మొదటి 15 నిమిషాలు చాలా క్లిష్టంగా ఉంటుందని, ఇప్పటివరకూ ఇంత క్లిష్టమైన మిషన్‌ను ఇస్రో ఎప్పుడూ చేయలేదని” అన్నారు.

భారత్ 2008లో చంద్రయాన్-1 లాంచ్ చేసింది. 1960వ దశకంలో అంతరిక్ష కార్యక్రమం ప్రారంభించింది. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ఎజెండాలో దీనికి అగ్ర ప్రాధాన్యం ఇచ్చారు. 2022 నాటికి భారత్ చంద్రుడిపై వ్యోమగామిని పంపాలనే ప్రణాళికతో భారత శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. అంతరిక్ష శాస్త్రంపై పుస్తకం రాసిన మార్క్ విటింగ్టన్ సీఎన్ఎన్‌తో .. భారత్ నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టింది. దీనివల్ల అది అంతరిక్షంలో ఒక మహా శక్తిగా ఆవిర్భవిస్తుంది. అంతరిక్షంలో చాలా కార్యక్రమాలను అభివృద్ధి చేయాల్సిన సమయం వచ్చిందని భారత్‌కు ఇప్పుడు అర్థమైంది.. అన్నారు.

Related posts