telugu navyamedia
telugu cinema news trending

29న .. మహర్షి నుండి ఫస్ట్ సింగల్ … !

mahesh babu movie maharshi second lookf

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు 25వ సినిమాగా ‘మహర్షి’ రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీకరణ పరంగా చివరిదశకి చేరుకుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, అల్లరి నరేశ్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.

ఈ సినిమా నుంచి సాంగ్స్ ను ఎప్పుడు వదులుతారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫస్టు సింగిల్ ను వదలడానికి అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 29వ తేదీన ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అశ్వనీదత్ .. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాను, మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Related posts

మహర్షి : ఎవరెస్టు అంచున… వీడియో ప్రోమో

vimala p

మతిమరుపు భర్తను … మళ్ళీ పెళ్లిచేసుకున్న భార్య.. అదీ ప్రేమపెళ్లట..

vimala p

ఏపీలో ఇంకా తగ్గని ఎండలు.. ఒంటిపూటే పాఠశాలలు..

vimala p