telugu navyamedia
సినిమా వార్తలు

“హౌజ్‌ఫుల్-4″లో అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్

House-Full-4

బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ హౌజ్ ఫుల్ ఫ్రాంచైజీలో భాగంగా “హౌజ్‌ఫుల్-4” చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న పాత్ర‌ల‌కి సంబంధించిన లుక్స్ విడుద‌ల‌య్యాయి. ఇందులో అక్ష‌య్ లుక్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. సెప్టెంబ‌ర్ 27న చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కానుండ‌గా, దీపావ‌ళికి మూవీని రిలీజ్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నారు. 2019 నుండి 1419కి ఈ చిత్రం తీసుకెళుతుంద‌ని అక్ష‌య్ అంటున్నారు. ఈ చిత్రాన్ని మొద‌ట సాజిద్ ఖాన్ తెర‌కెక్కించ‌గా ఆయ‌న‌పై వ‌చ్చిన లైంగిక ఆరోప‌ణ‌ల వ‌ల‌న ఆయ‌న స్థానంలో ఫ‌హ‌ద్ సంజీని ద‌ర్శ‌కుడిగా ఎంపిక చేశారు. ఇక నానా ప‌టేక‌ర్ స్థానంలోపై కూడా లైంగిక ఆరోప‌ణ‌లు రాగా ఆయ‌న స్థానంలో రానాని తీసుకున్నారు. కృతి స‌నన్, రితేష్ దేశ్‌ముఖ్‌, పూజా హెగ్డే, బాబి డియోల్‌, కృతి క‌ర్భందా చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. చిత్రంలో అక్ష‌య్ కుమార్ బాలా మ‌రియు హ‌ర్రి పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నాడు.

Related posts