telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“మైదాన్” నుంచి అజయ్ దేవగణ్ లుక్ అవుట్

Maidaan

ఇటీవల “తాన్హాజీ”తో సంచలన విషయాన్ని తన వేసుకున్న అజయ్ దేవ‌గ‌ణ్ ప్ర‌స్తుతం “మైదాన్” అనే సినిమా చేస్తున్నారు. మైదాన్ చిత్రం స‌య్య‌ల్ అబ్ధుల్ ర‌హీం జీవితం ఆధారంగా తెర‌కెక్కుతుంది. 1952 నుంచి 1962 మధ్య కాలంలో ఫుట్‌బాల్‌ క్రీడలో ప్రపంచ దేశాలపై అద్భుత ఆధిపత్యం ప్రదిర్శించింది భార‌త్. ఆ స‌మ‌యంలో ఆ జ‌ట్టుకి కోచ్‌గా స‌య్య‌ద్ అబ్ధుల్ ర‌హీం ఉన్నారు. ఆయ‌న జీవితాన్ని ఆధారంగా చేసుకొని ‘మైదాన్‌’ పేరుతో చిత్రాన్ని వెండితెరపైకి తీసుకురాబోతున్నారు బోనీ కపూర్‌. జీ స్టూడియోస్‌ సమర్పణలో రూపొందబోయే ఈ చిత్రంలో అజయ్‌ దేవగణ్‌, కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. ‘బదాయి హో’ చిత్రంతో జాతీయ అవార్డును అందుకున్న అమిత్‌ రవీందర్‌నాథ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఇందులో అజ‌య్ దేవ‌గ‌ణ్ ఫుల్‌బాల్ కోచ్‌గా క‌నిపించ‌నున్నారు. న‌వంబ‌ర్ 27,2020న విడుద‌ల కానున్న ఈ చిత్రంలో అజ‌య్ దేవ‌గ‌ణ్ లుక్‌ని మేక‌ర్స్ కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేశారు. ఫుట్ బాల్ కోచ్‌గా అజ‌య్ లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది. ఇక అజయ్ దేవగణ్ “ఆర్ఆర్ఆర్” సినిమాలో కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు.

Related posts