వంగవీటి రంగా, దేవినేని నెహ్రూ ఇద్దరి కథతో తెరకెక్కుతోన్న చిత్రం “దేవినేని”. శివనాగు దర్శకత్వంలో ఆర్‌టిఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ నిర్మిస్తున్నారు. దేవినేని నెహ్రూగా టైటిల్ పాత్రలో నందమూరి తారకరత్న నటిస్తుండగా, వంగవీటి రంగా పాాత్రలో ప్రముఖ పత్రికాధిపతి, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేష్ కొండేటి (సంతోషం సురేష్) నటిస్తున్నారు. నేడు వంగవీటి రంగా 72వ జయంతి సందర్భంగా రంగా పాత్రధారి ఫస్ట్ లుక్ ని చిత్రయూనిట్ లాంచ్ చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు శివనాగు మాట్లాడుతూ “బెజవాడలో జరిగిన ఇద్దరు మహానాయకుల మధ్య జరిగిన యదార్థ కథను కళ్ళకు కట్టినట్టు తెరకెక్కిస్తున్నాం. దేవినేని – రంగా పాత్రలు ఒకదానితో ఒకటి పోటాపోటీగా ఉంటాయి. ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ చిత్రీకరిస్తున్న ఈ చిత్రం చాలా నేచురల్‌గా వుంటుంది. తాజాగా వంగవీటి రంగా పాత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తున్నాం. రంగా పాత్రలో సురేష్ కొండేటి నటన ఆకట్టుకుంటుంది. దేవినేని పాత్రలో తారకరత్న అంతే అద్భుతంగా నటించారు“ అని తెలిపారు.
previous post