telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

మేయర్ సందీష్ జోషి పై .. దుండగుల కాల్పులు…

firing on mayor sandeep joshi

పెళ్లి రోజు సందర్భంగా సందీష్ జోషి కొంతమంది స్నేహితులతో కలిసి నాగ్ పూర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దనున్న ఓ దాభాలో విందు జరుపుకున్నారు. అనంతరం సందీష్ జోషి..స్వయంగా తన కారు నడుపుకుంటూ ఇంటికి బయలుదేరారు. వార్థా రోడ్డు జంక్షన్ వద్దకు చేరుకోగానే..బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారును అడ్డగించారు. అనంతరం ఫైరింగ్ ఓపెన్ చేశారు. అనంతరం వెంటనే వారు పరారయ్యారు. ఓ బుల్లెట్ మేయర్ కూర్చొన్న డ్రైవింగ్ సీటు అద్దాలకు, మరో బుల్లెట్ వెనుక సీటు విండోకు, ఇంకో బుల్లెట్ వాహనం వెనుక వైపు తగిలింది.

వెంటనే జోషి..కాల్పుల విషయాన్ని పోలీసులకు తెలియచేశారు. ఘటనా ప్రదేశానికి పోలీసులు చేరుకున్నారు. ధాబా నుంచి బయలుదేరినప్పటి నుంచి కారును నిందితులు అనుసరించారని, అనువైన సమయం చూసి కాల్పులు జరిపినట్లు అడిషనల్ సీపీ నీలేష్ వెల్లడించారు. ఆక్రమణలు తొలగించడంపై జోషిని బెదిరిస్తూ..NMC కంప్లైట్ బాక్స్‌లో రెండు లేఖలు వచ్చాయి.

Related posts