telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అమెరికా : … డ్రగ్స్ నిందితుడిని పట్టుకునే తరుణంలో కాల్పులు…7 అధికారులకు గాయాలు…

firing in america to caught drug supplier

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఎప్పుడు ఎక్కడ కాల్పులు జర్గుతాయో తెలియక బయటకి వెళ్ళాలంటేనే ఆందోళన చెందుతున్నారు అమెరికా ప్రజలు. ముఖ్యంగా విదేశీయులు తమపై ఎక్కడ జాత్యహంకార దాడులు జరుగుతాయో అంటూ భయం గుప్పిట్లోనే మగ్గుతున్నారు. అయినా సరే ఇప్పటికి కూడా తుపాకుల సంస్కృతికి అమెరికా ప్రభుత్వం అడ్డు చెప్పడంలేదు, చర్యలు చేపట్టడంలేదు.కొన్ని రోజుల క్రితం ఒహియో, ఎల్పాసో లో జరిగిన కాల్పుల ఘటన ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నా ఆ సంఘంటనలు ఇంకా మరిచిపోక ముందే మరో సారి ఫిలడెల్ఫియా లో కాల్పులు జరిగాయి.

డ్రగ్స్ సరఫరా కేసులో నిందితుడుగా ఉన్న మారిన్ హిల్ అనే వ్యక్తి స్థానికంగా ఓ ఇంట్లో ఉన్నాడన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. పోలీసులు వచ్చిన సమాచారం తెలుసుకున్న అతడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.దాంతో సుమారు ఏడుగురు పోలీసులకి గాయాలు అయ్యాయి. ఇలా దుండగుడికి , పోలీసులకి మధ్య 7 గంటల పాటు కాల్పులు జరిగాయి. చివరికి దుండగుడు పోలీసులకి లొంగిపోయాడు. పోలీసులు ఎంతో సాహసంగా అతడిని పట్టుకున్నందుకు స్థానిక మేయర్, ప్రజలు అభినందించారు.

Related posts