రాజకీయ వార్తలు

యూట్యూబ్ ఆఫీసులో కాల్పుల కలకలం

యూట్యూబ్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నాడు జరిగిన కాల్పులు సంచలనం కలిగించాయి .
అమెరికాలోని శాన్ బ్రూన్ దగ్గరవున్న యూట్యూబ్ కార్యాలయం లో ఓ మహిళ 10 రౌండ్లు కాల్పులు జరిపింది . ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు . కాల్పులు జరిపిన మహిళా తనని తాను కాల్చుకొని మరణించింది .
ఈ కార్యాలయం సాన్ ఫ్రాన్సిస్కో పది మైళ్ళ దూరమలో వుంది . సిలికాన్ వాలీ మధ్యలో వుంది . యూట్యూబ్ కార్యాలయంలో అప్పుడు 1100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు . కాల్పుల మోతకు వారంతా కలవరపడిపోయారు , పెను ప్రమాదం జరుగుతుందేమొ అనే ఉద్దేశ్యంతో వారంతా నిముషాల్లో కార్యాలయం నుంచి బయటకు వచ్చేశారు . ఈ ఘటన జరిగిన నిమిషాల్లోనే పోలీసులు వచ్చారు .
ఆమె కుటుంబ కలహాల వల్ల ఈ పని చేసి ఉండొచ్చునని పోలీసులు చెబుతున్నారు . గాయపడినవారిని వెంటనే దగ్గర్లో వున్న ఆసుపత్రిలో చేర్పించారు.
ఈ ఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు .
కాల్పుల ఘటనను అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు అధికారులు తెలియజేశారు .

Related posts

స్వలింగ సంపర్కం ఏఏ దేశాలలో నేరం… ఏఏ దేశాలలో నేరం కాదో తెలుసా ?

vimala t

ఎన్నో ఏళ్ల కలను సాకారం చేశాం: హరీష్ రావు

admin

ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఎందుకు షాకిచ్చాడో తెలుసా!

madhu

Leave a Comment