telugu navyamedia
క్రైమ్ వార్తలు

పనిలేక.. గుడిసెలకు నిప్పంటించిన.. ఫైర్ ఫైటర్… విస్తుపోయిన అధికారులు..

Mojamjahi Market Fire Accident

ఒకడు ఉద్యోగం లేక అల్లల్లాడిపోతుంటే, మరొకడు ఉద్యోగం ఉండి పని లేక అల్లాడిపోయాడట. అలాగే ఉంది ఇప్పుడు చెప్పబోతున్న సంఘటన. ఫైర్ స్టేషన్ లో పనిచేస్తూ, పనిలేదని, బోర్ కొడుతుందని తనకు తానే పని కల్పించుకున్నాడు ఈ కుర్రాడు.. అదెలాగంటే.. ముంబైలోని ఓ కుర్రాడు మాత్రం ఏకంగా ఇళ్లకు నిప్పు పెట్టడం ప్రారంభించాడు. పైగా అతడు వాలంటీర్ ఫైర్ ఫైటర్ కావడం గమనార్హం. గత నెల 3వ తేదీ, ఆపై 10వ తేదీల్లో ముంబైలోని ఇళ్లు ఉన్నట్టుండి దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన పోలీసులు ర్యాన్ లుభం (19) అనే యువకుడిని నిందితుడిగా తేల్చారు.

అగ్ని ప్రమాదాలు జరిగితే అగ్నిమాపకశాఖతో కలసి రంగంలోకి దిగి మంటలు ఆర్పుతూ అందరి మన్ననలూ పొందే ర్యాన్ ను విచారించిన పోలీసులు, అతను చెప్పిన కారణాన్ని విని విస్తుపోయారు. తనకు బోర్ కొట్టిందని, అందువల్లే ఇళ్లకు నిప్పంటించానని విచారణలో చెప్పాడట. పైగా, నిప్పంటించిన తరువాత, అతనే స్వయంగా పోలీసులకు సమాచారం ఇచ్చాడని కూడా తేల్చారు. సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు, ర్యాన్ పై అనుమానం వచ్చి అరెస్ట్ చేసి, నిజాన్ని తేల్చారు. కాగా, ఫైర్‌ ఫైటర్లే ఇలా నిప్పంటించడం ఇదే తొలిసారేమీ కాదు. అమెరికా సహా పలు దేశాల్లో ప్రతియేటా సుమారు వంద మందికి పైగా ఫైర్‌ ఫైటర్లు ఇలా నిప్పంటించిన కేసులలో అరెస్ట్ అవుతూనే ఉన్నారు. పనిలేనివాడు.. ఏదో పీకాడు అంటే ఇదేనేమో!

Related posts