అరిజోనాలోని బేస్‌లైన్ రోడ్ 67వ అవెన్యూ నుంచి అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ రాగా, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు వెళ్ళి మంటలను ఆపేందుకు ప్రయత్నించారు. ఖాళీగా ఉన్న ఆ బిల్డింగ్‌లో వందలాది పాములు, పిల్లులు, పక్షులు ఇతర మూగజీవులు ఎన్నో ఏళ్లగా నివాసముంటున్నాయని, వాటిని రక్షించాలని స్థానికులు ఫైర్ సిబ్బందిని కోరారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది బకెట్లతో బిల్డింగ్ లోపలకు వెళ్లి పాములను, ఇతర జంతువులను బకెట్లలో వేసి రక్షించారు. ఇదొక విచిత్ర సంఘటన అని, సినిమాల్లో మాత్రమే ఇలాంటివి జరుగుతాయని, తమ జీవితంలో ఇలాంటి సంఘటన ఎన్నడూ జరగలేదని అగ్నిమాపక అధికారులు తెలిపారు.
previous post