Trending Today క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

అపోలో ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం… రోగులను తరలింపు

Fire Accident in Hyderabad Apollo Hospital

ప్రతిష్ఠాత్మక అపోలో ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న అపోలో ఆసుపత్రిలో కొద్దిసేపటి క్రితమే ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది… దీనితో వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు రెండు ఫైర్ ఇంజన్ లతో అక్కడకు చేరుకొని అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద మంటలను ఆర్పేశారు….

Fire Accident in Hyderabad Apollo Hospital

కాగా ఈ ప్రమాదానికి గల కారణం షాట్ సర్క్యూట్ అని తెలిసింది… ఈ ప్రమాదంలో అపోలో ఆసుపత్రి సెల్లార్ మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది… వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటలను పైకి వ్యాపించకుండా జాగ్రత్తలు పాటించారు.. రోగులను, ఇతర సిబ్బందిని బయటకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు.. కాగా ఈ ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉన్నాయి…

Related posts

‘మా’ జరిపిన చిరంజీవి జన్మదిన వేడుకల…చిత్రాలు..

chandra sekkhar

7 టన్నుల చేపలను పూడ్చేసిన అధికారులు… కేసు నమోదు

nagaraj chanti

బిచ్చగాడిని కొట్టి చంపిన ప్రముఖ మోడల్… కేసు నమోదు

nagaraj chanti

Leave a Comment