telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆదాయం అడుగంటిపోతుందంటున్న .. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన …

Mla buggana,data leake

వివిధ సమస్యలు, మద్యనిషేధం లాంటివాటితో ఖజానాకు మరింత ఆదాయ దారులు మూసుకుపోయాయని, రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే దిశలో ప్రత్యామ్నాయ మార్గాలను వెదకాలని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన సచివాలయంలో ఆదాయ వనరుల శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసుక విక్రయాలు లేకపోవడం. మద్యం వినియోగాన్ని తగ్గించే దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటంతో ఆదాయం గణనీయంగా తగ్గుతోందని అధికారులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

దీనిపై స్పందించిన ప్రభుత్వ కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు ఖజానాను నింపే దిశలో ఇతర మార్గాలను అన్వేషించాలని సూచించారు. పేరుకుపోయిన మొండి బకాయిలను కూడా రాబట్టే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశిరచారు. ఈ సందర్భంగా అధికారులు అందచేసిన సమాచారం పూర్తిస్థాయిలో లేదన్న అభిప్రాయాన్ని మంత్రి వ్యక్త ంచేశారు. తరువాతి సమావేశానికి అన్ని వివరాలతో రావాలని ఆదేశించారు. ఈ సమావేశానికి ఆర్ధిక, రెవెన్యూ, ఎక్సైజ్‌, రవాణా వంటి కీలక శాఖల అధికారులు హాజరయ్యారు.

Related posts