telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజులు ఖరారు చేసిన ఏపీ సర్కార్‌..

ఏపీలోని ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, బి-ఫార్మసీ ప్రైవేట్ కళాశాలలకు బోధనా రుసుములు నిర్ణయిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2020-21 నుంచి2022-23 వరకు మూడేళ్లపాటు ఈ బోధన రుసుములు అమల్లో ఉంటాయని పేర్కొన్న ప్రభుత్వం…. రాష్ట్రంలోని 240 ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ మెరైన్ ఇంజనీరింగ్ కళాశాలలకు బోధన రుసుములు ఖరారు చేసింది. ఇంజినీరింగ్ కళాశాలలకు కనిష్టంగా రూ. 35 వేలు.. గరిష్టంగా రూ. 70 వేలుగా ఫీజులు నిర్ధారించింది ప్రభుత్వం. ఐదు కళాశాలలకు అత్యధికంగా రూ. 70 వేలు ఫీజుగా ఖరారు చేసింది ప్రభుత్వం…. 113 బీ ఫార్మసీ ప్రైవేట్ కళాశాలలకు కనిష్టంగా రూ. 35 వేలు.. గరిష్టంగా రూ. 65 వేలుగా ఖరారు చేసింది.

Related posts