telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహిళలపై ప్రముఖ దర్శకుడి అనుచిత వ్యాఖ్యలు… మహిళా సంఘాలు ఫైర్

Bjagyaraja

సీనియర్ నటుడు, దర్శకుడు కే భాగ్యరాజ ఓ సినీ వేడుకలో మాట్లాడుతూ దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. మహిళలు కట్టుబాట్లు వదిలేస్తున్నారని ఆయన మండి పడ్డాడు. స్త్రీలపై వేదింపులు, అత్యాచారాలు కేవలం వారి అజాగ్రత్త వల్ల మాత్రమే జరుగుతున్నాయన్నాడు. ప్రస్తుతం మహిళలు ఎక్కువగా సెల్‌ఫోన్‌తోనే సమయం గడుపుతున్నారు. ఒక్కొక్కరు రెండు ఫోన్లు, రెండు సిమ్‌లు వాడుతున్నారు. వారిపై అఘాయిత్యాలకు ఇది కూడా ఓ కారణమే అన్నాడు. మహిళలు కట్టుబాట్లలో ఉన్నప్పుడు ఇలాంటి దారుణాలు జరగలేదన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇటీవల సంచలనం సృష్టించిన పొల్లాచ్చి సంఘటనను ప్రస్తావించిన భాగ్యరాజ, వింత లాజిక్‌ను తెర మీదకు తెచ్చాడు. ఈ విషయంలో కేవలం అబ్బాయిలను మాత్రమే తప్పు పట్టడం కరెక్ట్ కాదన్నాడు. అమ్మాయిలు చేసిన పోరపాట్లను మాత్రమే అబ్బాయిలు ఉపయోగించుకుంటున్నారని, అమ్మాయి జాగ్రత్తగా వ్యవహరిస్తే ఇలాంటి సంఘటనలు జరగవన్నాడు. పొల్లాచ్చి సంఘటన విషయంలోనూ అమ్మాయిదే తప్పన్నట్టుగా మాట్లాడాడు. “మహిళలు గతంలో చాలా సాంప్రదాయబద్ధంగా, కట్టుబాట్లతో ఉండేవారు. స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. మొబైల్ ఫోన్లు వచ్చాక మహిళలు స్వీయ నియంత్రణ కోల్పోయారు. మహిళలు చనువిస్తేనే పురుషులు తప్పులు చేస్తున్నారు. అన్నివేళలా పురుషులనేతప్పుబట్టడం సరికాదు. నిజానికి పురుషులు వివాహేతర సంబంధం పెట్టుకుంటే అది చిన్న విషయంగానే ముగిసిపోతోంది. అదే మహిళలు వివాహేతర సంబంధం పెట్టుకుంటే కట్టుకున్న భర్తని, కన్న బిడ్డలను కూడా చంపేస్తున్నారు” అని భాగ్యరాజా వ్యాఖ్యానించారు. ఇప్పటికే మీటూ ఆరోపణలతో తమిళ ఇండస్ట్రీ పరువు పోయిందని బాధపడుతున్న తరుణంలో భాగ్యరాజ చేసి ఈ వ్యాఖ్యలు మరింత కాకపెంచుతున్నాయి.

Related posts