telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సినిమా వార్తలు

సినిమా షూటింగ్ లో సిలిండర్‌ పేలి తల్లీకూతుళ్లు మృతి

cylinder blast in Filmnagar hyderabad

ప్రముఖ నటుడు చిరంజీవి సర్జా నటిస్తోన్న ‘రణం’ సినిమా షూటింగ్ బెంగుళూరు నగరంలోని బాగాలూరులో జరుగుతోంది. ఈ క్రమంలో ప్రమాద వశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో తల్లీకూతుళ్లు మరణించారు. మృతులను చిన్నారి అయిషా ఖాన్(5), తల్లి సుయేరా భానుగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే సుయేరా భాను తన ఐదేళ్ల చిన్నారితో కలిసి షూటింగ్ చూడడానికి వెళ్లింది. ఆ సమయంలో కారును బ్లాస్ట్ చేసే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా సిలిండర్ పేలడంతో అక్కడే ఉన్న తల్లీకూతుళ్లు మృతి చెందారు. మరో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. పేలుడు జరిగిన తరువాత షూటింగ్ ఆపేసి చిత్రబృందం అక్కడ నుండి పారిపోయింది. ఈ సినిమాలో హీరోగా నటిస్తోన్న చిరంజీవి మరో సినిమా షూటింగ్ కోసం మైసూరుకి వెళ్లారు. మరో ప్రధాన పాత్ర పోషిస్తున్న చేతన్ కుమార్ విషయం తెలుసుకొని తన ఆవేదన వ్యక్తం చేశాడు. మృతుల కుటుంబాలను ఆడుకొంటామని తెలిపారు.

Related posts