telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

కత్తి మహేశ్ కన్నుమూత…

తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, ఫిల్మ్ క్రిటిక్, కత్తి మహేష్ కన్నుమూసారు. పది రోజుల కింద యాక్సిడెంట్‌కు గురైన ఈయన.. చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కానీ ఈరోజు ఈయన ఆరోగ్యం విషమించి కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు. కత్తి మహేష్ మృతితో ఒక్కసారిగా అందరూ షాక్‌లోకి వెళ్లిపోయారు రెండు వారాల క్రితం నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో క‌త్తి మ‌హేష్ ప్ర‌యాణిస్తున్న‌ కారు యాక్సిడెంట్ గురైంది. ఈ ప్ర‌మాదంలో ఆయ‌న త‌ల‌కు తీవ్ర గాయ‌ల‌య్యాయి. క‌న్ను కూడా కోల్పోయారు. కొద్దిరోజులుగా ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగానే ఉంది. ఈ క్ర‌మంలో ప‌రిస్థితి మ‌రింత‌ విషమించి ఆయ‌న చ‌నిపోయిన‌ట్టుగా వైద్యులు చెబుతున్నారు. వైద్యులు ఎంత ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ ఆయ‌న ప్రాణం నిల‌వ‌లేదు.క‌త్తి మ‌హేష్ మృతిప‌ట్ల సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Related posts