• Home
  • వార్తలు
  • టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ..పలువురికి గాయాలు
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ..పలువురికి గాయాలు

telangana congress attitude towards elections

సిద్ధిపేట జిల్లాలోని గోవర్ధన్‌గిరిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు ఘర్షణకు దిగారు. తాజా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ చేపట్టిన ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ప్రచారానికి వెళ్లిన సతీష్ కుమార్‌ను స్థానికులు అడ్డుకున్నారు. గ్రామాభివృద్ధికి ఏం చేశారంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. సతీశ్ కుమార్ ప్రచారం కోసం ముందుకు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించారు.

దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలకు మద్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.  ఈ ఘర్షనలో మహిళలు కూడా పాల్గొనడంతో గ్రామం రణరంగంగా మారింది.  పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.జై తెలంగాణ అంటూ నినాదాలు ఇస్తూ కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ జెండా కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని అధికారులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు.

Related posts

పార్టీ మారను.. నోటీసుపై వివరణ ఇస్తా: రాజగోపాల్‌ రెడ్డి

madhu

పేప‌ర్ బాయ్ సెన్సార్ పూర్తి…

chandra sekkhar

తెలుగులో ‘నవాబ్‌’…అశోక్ వల్లభనేని..సొంతం

chandra sekkhar

Leave a Comment