telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ప్రజలకు… నేతల సంక్రాంతి శుభాకాంక్షలు…

sankranthi festival and reasons behind it

నేడు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర నాయకులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా, ఏపీసీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి పండుగ నవ్యాంధ్రప్రదేశ్ కు నవ క్రాంతి కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘‘నిరుపేదల కళ్లలో వెలుగు చూడటమే నాకు నిజమైన సంక్రాంతి. ఈ సంక్రాంతి నవ్యాంధ్రప్రదేశ్‌కు నవ క్రాంతి అవ్వాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ ‘మకర సంక్రాంతి’ శుభాకాంక్షలు. పెన్షన్లను రెట్టింపు చేసి ఇంటికి పెద్దకొడుకుగా సంక్రాంతి కానుక ఇవ్వడం నాకెంతో సంతృప్తినిస్తోంది’’ అని ట్వీట్ చేశారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి నాగాలమ్మ ఆలయం వద్ద ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తల్లిదండ్రులు ఖర్జూరనాయుడు, అమ్మణ్ణమ్మ సమాధుల వద్ద నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వెంట కుమారుడు లోకేశ్, కోడలు నారా బ్రాహ్మణి, భార్య భువనేశ్వరితో పాటు నందమూరి కుటుంబ సభ్యులు ఉన్నారు.

ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ తెలుగు ప్రజలకు ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజల ఇళ్లు భోగభాగ్యాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు ఉదయం ట్విట్టర్ లో జగన్ స్పందిస్తూ..‘తెలుగువారందరి ఇంటా భోగభాగ్యాలూ, సిరిసంపదలూ, సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ వర్ధిల్లాలనీ, ఎంతో గొప్పవైన మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం నిలవాలని నిండు మనసుతో కోరుకుంటూ… అందరికీ సంక్రాంతి శుభాక్షాంక్షలు. Happy #Sankranthi2019’ అని జగన్ ట్వీట్ చేశారు.

Related posts