telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

భోగి రమ్మంటుంది.. బోగి వద్దంటుంది.!

Festival Season Heavy Passangers Railway Stations
సంక్రాంతికి ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చినప్పటికీ అవి ప్రయాణీకులకు సరిపోవడం లేదు. రైల్వేస్టేషన్‌ లు ప్రయాణీకులతో కిక్కిరిసి పోతున్నాయి. హైదరాబాద్ నగరం నుంచి లక్షల మంది సొంతూళ్లకు వెళ్లే వారితో ప్రయాణికుల రద్దీ  భారీగా పెరిగింది.  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పరిస్థితి దారుణంగా ఉంది. ప్లాటుఫామ్ పై భారీ సంఖ్యలో ప్రయాణీకులు పోటెత్తడంతో రైల్ ఎక్కడానికి ప్రయాణీకులు నానా తంటాలు పడవలిసి వస్తుంది. గత రెండు రోజులుగా రైల్ బోగి ఎక్కాలంటే ప్రయాణీకులు సాహసం చేయాల్సిందే. మహిళలు చిన్నారులు రైల్ ఎక్కలేకపోతున్నారు. 
Festival Season Heavy Passangers Railway Stations
నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్‌ల నుంచి ప్రతి రోజు లక్షల్లో ప్రయాణికులు సొంత ఊళ్లకు తరలి వెళ్తున్నారు. దీంతో ఆయా రైల్వే  స్టేషన్లు ప్రయాణీకులతో పోటెత్తాయి. రాత్రింబవళ్లు  నగరంలోని  ఆంధ్రాప్రాంతానికి,  తెలంగాణాలోని ఇతర జిల్లాలకు తరలి వెళతారు. ప్రయాణికుల రద్దీతో  రైల్వేస్టేషన్‌లు కిటకిటలాడుతున్నాయి. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీబస్‌స్టేషన్‌లతో పాటు, కూకట్‌పల్లి, మియాపూర్, ఉప్పల్, ఎల్‌బీనగర్, సాగర్‌రింగురోడ్, తదితర ప్రధాన కూడళ్లు ప్రయాణికులతో పోటెత్తాయి. 
గత రెండు రోజులుగా సుమారు 10 లక్షల మంది నగరవాసులు సొంత ఊళ్లకు తరలి వెళ్లారు. వివిధ ప్రాంతాలకు   ప్రతి రోజు రాకపోకలు సాగించే సుమారు 200 రైళ్లతో పాటు  మరో  150 రైళ్లను దక్షిణమధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది.  సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్‌ల నుంచి ప్రతి రోజు వందల సంఖ్యలో రైళ్లు, లక్షల్లో ప్రయాణికులు సొంత ఊళ్లకు తరలి వెళ్తున్నారు. అన్ని రైళ్లలోనూ  చాలావరకు బుకింగ్‌లు నిలిచిపోయాయి. ప్రస్తుతం జనరల్‌ బోగీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

Related posts