telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సినిమా వార్తలు

తమిళనాడులో ముందే మొదలైన… సంక్రాంతి సందడి…

festival comes early in tamilanadu as jallikattu

సంక్రాంతి సందడి అప్పుడే తమిళరాష్ట్రంలో కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అక్కడ బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన సాంప్రదాయ వేడుకలతో తమిళనాట.. పండగ సందడి ప్రారంభం అయ్యింది. అందుకే, తమిళనాడులో కొత్త సంవత్సరం వచ్చిన తొలిరోజే సంక్రాంతి సందడి ప్రారంభమైంది. అరియలూరు జిల్లా సాత్తాన్ కుప్పంలో జల్లికట్టు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

దీనిలో సుమారు 60 ఎద్దులు పరుగులు పెటుతుంటే, వాటిని అదుపు చేసేందుకు 300 మంది యువకులు పోటీ పడ్డారు. ఈ పోటీలను తిలకించేందుకు వేలాది మంది తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. రేపు విరుద్ నగర్ జిల్లాలో జల్లికట్టు పోటీలు ప్రారంభం కానున్నాయి. కాగా, జల్లికట్టు కారణంగా జంతువులను హింసించరాదని, పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎస్పీ గుప్తా చెప్పారు. సుప్రీంకోర్టు నిబంధనలను మీరకుండా జల్లికట్టు జరుపుకోవచ్చని అన్నారు.

Related posts