telugu navyamedia
health news trending

మెంతులలో ఉన్న… ఆరోగ్య రహస్యాలు… తెలుసా..

fenugreek and its health secreats

మెంతులు అనగానే భారతీయులకు గుర్తుకువచ్చేది, నిల్వ పచ్చళ్ళు. వాటిలో ప్రతిదానిలో వేడి చేయకుండా ఉండేందుకు అని చెప్పి పెద్దలు మెంతు పొడి కూడా వేసేవారు. అయితే ఇలా చేయడానికి వెనుక కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి. మరి కొంతమంది మెంతులను తిరగమాత గింజలతో కలిపి కూడా వాడుతుంటారు. ఏవిధంగా వాడినా మెంతులు దేశంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది. అది ఎందుకు, ఆ రహస్యం ఏమితో చూద్దాం.

శరీరానికి అడ్డమైన ఆహారం అందిస్తే, వాటిలో చెత్తతో కఫము ఏర్పడుతుంది. దీనివలన అనేక రోగాలు బయలుదేరుతాయి. మరి అదంతా బయటకు పంపించాలి కదా. కఫము, వాతం లాంటివి సహజంగా కనిపించే వైనా, వాటివలన తీవ్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అటువంటి వాటికి చక్కగా పనిచేస్తుంది, ఈ మెంతులు గనక ఆహారంలో తీసుకుంటే. మలబద్దకం సమస్య ఉన్నవారికి ఇవి చాలా మేలుచేస్తాయి.

శరీరంలో చెడు కొవ్వు పేరుకుపోకుండా మెంతులు చక్కగా ఆదుకుంటాయి. అధిక బరువు ఉన్నవారికి ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు.

నేటి జీవనవిధానంలో 10లో కనీసం 3 కి చక్కర వ్యాధి ఉంటుంది. వారికి కూడా మెంతులు చక్కటి పరిష్కారం. శరీరంలో ఉండాల్సిన గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో మెంతులు ప్రధాన భూమిక పోషిస్తాయి. రక్తంలో చక్కర ఎక్కువగా ఉన్నవారు రోజు ఉదయం అర టీ స్పూన్ మెంటుపొడిని తీసుకుంటే, సమస్య తగ్గుముఖం పడుతుంది.

మెంతులు జీర్ణవ్యవస్థను పుంజుకునేట్టుగా చేస్తాయి. దీనితో ఆకలి లేదని తిండి సరిగా తినక సన్నగా ఉండేవారికి ఇవి రోజు ఆహారంలో చేర్చితే ఆకలి బాగా వేసి, చక్కగా జీర్ణం అవుతుంది కూడా. మెంతులలో శరీరాన్ని చల్ల బరిచే గుణం ఉండటం వలన, శరీరానికి చెమట పట్టించి, ఆ విధంగా వ్యర్దాలను బయటికి పోయేందుకు కూడా సహకరిస్తాయి.

నీళ్ల విరేచనాలు అవుతున్న వారికి మెంతులు ఇస్తే, ఉపశమనం ఉంటుంది. మెంతులలో జిగురు గుణం, పేగులలో అల్సర్ లను, పేరులలో వాపులను తగ్గిస్తుంది. వీటిలో ఉన్న చేదు గుణం కాలేయాన్ని శక్తివంతం చేస్తుంది.

మెంతులు పునరుత్పత్తి సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. మహిళలలో ఉండే గర్భాశయ ఆరోగ్యాన్ని మెంతులు పెంచుతాయి. ప్రసవం అనంతరం మెంతులు వాడుతుంటే, పేగులలో కదలిక మెరుగుపడటమే కాకుండా, గర్బాశయంలోని చేడు రక్తం వెలుపలికి వచ్చేసి, గర్భాశయం శుద్ధి జరుగుతుంది. తల్లిపాల తయారీకి కూడా మెంతులు చాలా చక్కగా పనిచేస్తాయి.

పెద్దవాళ్లలో, మహిళలలో తరచూ కనిపించే నడుము నొప్పి, సయాటికా, కీళ్లనొప్పి, వాపులు, కండరాల నొప్పి తదితర సమస్యలను మెంతులు చక్కగా నివారించగలవు. ఎముకలను శక్తివంతం చేయడం అనే గుణం మెంతులలోని ఔషధ గుణాలలో ఉంది. మెంతులు నీళ్లలో కలిపి పై పూతగా లేదా పట్టుగా వాడితే ఇన్ఫెక్షన్ లు, చీము, పొక్కులు, ఎముకలు విరగడం, కీళ్లవాపు మొదలైన సమస్యలు త్వరగా తగ్గుముఖం పడతాయి.

Related posts

ఇంటిలిజెన్స్‌ అధికారుల బదిలీపై కోర్టులో సవాల్‌

vimala p

పెళ్లిలో విషాదం.. భర్త కాల్పుల్లో భార్య మృతి

vimala p

బి.సరోజాదేవికి ‘విశ్వనటసామ్రాజ్ఞి’ బిరుదు తో సత్కారం : మార్చి 4న విశాఖలో లో వేడుక 

vimala p