telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు సామాజిక

అలసటకు .. పాదాలమసాజ్ తో .. చెక్..

feet massage best for stress relief

నేటి బిజీ జీవితంలో ఎక్కువ పని, శారీరక శ్రమ అధికం అవ్వటం, అందుకు ఏకైక సూచికగా శారీరక నొప్పి, అనారోగ్యం, అలసట, నిరాశ మొదలైన వాటికి కొరత ఉండటం లేదు. మనం వారానికి ఒక రోజు సెలవు తీసుకుంటే, మీరు ప్రశాంతంగా నిద్రపోతారు. కాబట్టి వారానికి ఒకసారి నూనెతో బాడీ మసాజ్ చేసి స్నానం చేయాలని, కాసేపు వ్యాయామం చేయాలని వైద్య నిప్పులు సూచించారు. తలపై నూనెతో మర్దన వల్ల తలనొప్పి, ఒత్తిడి మరియు ఇతర శరీర అలసట నుండి ఉపశమనం లభిస్తుంది అన్న విషయం అందరికి తెలిసిందే.అలాగే మీరు పాదాలకు మసాజ్ చేస్తే, అది కూడా శరీరానికి చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది అని అనేక వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అవును, రోజువారీ పనులు చేసుకొనేవారు అనేక వ్యాధులతో సతమతం అవుతున్నారు, అలాంటి వారు రోజూ పాదాలకు మసాజ్ చేసి నిద్రపోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు అని చెప్తున్నారు.

వైద్యులు దీనిపై సూచనలు ఇలా చెప్పారు..ప్రతి రోజు రాత్రి మనం పడుకునే ముందు 10 నుండి 15 నిమిషాలు పాదాలకు మసాజ్ చేయడం వల్ల ఏకరీతిగా రక్త ప్రవాహం జరుగుతుంది. పాదాలకు మసాజ్ చేయడం వల్ల మరికొన్ని ఉత్తమ ప్రయోజనాలు కూడా ఉన్నాయని అయన తెలిపారు. పాదాలు పై అనేక ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, వాటిని మసాజ్ చేయటం వల్ల అవి ఆక్టివేట్ అయ్యి మనకి ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. రోజు రాత్రి పడుకునే ముందు ఒక్క అయిదు నిముషాలు పాదాలకు మసాజ్ చేసుకోవడం వల్ల అనేక అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి కనుక మనం ఏదైనా ఆయిల్ తో రోజు మసాజ్ చేసుకొని నిద్రపోతే, శరీరం పూర్తిగా ఉతేజం కలిగి, ప్రశాంతంగా నిద్ర కూడా పడుతుంది.

Related posts