telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

ఖరీదు కానున్న… డిగ్రీ చదువులు.. అది విద్యార్థులే భరించాలట ..!

fees hike to degree courses by state

చదువులు భారం అయ్యో లేక, చదవలేకో ఇటీవల చాలా మంది అయితే ఇంజనీరింగ్ బి.టెక్ చేస్తున్నారు, ఎక్కువ మంది డిగ్రీ చేసి చదువు ఆపేస్తున్నారు. ఇది ప్రభుత్వం గమనించిందేమో, ఆ తరగతులకు మరోసారి ఫీజుల పెంపు నిర్ణయానికి వచ్చేశారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కోర్సుల రుసుం భారీగా పెరగనుంది. వచ్చే విద్యాసంవత్సరానికి (2019-20) కోర్సులను బట్టి రూ.5వేల నుంచి రూ.7,500 వరకు రుసుం పెంపు ఉండే అవకాశం ఉంది. దీనిపై తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. రుసుములను పెంచాలని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చిన విద్యామండలి త్వరలో రాష్ట్రంలోని ఆరు సంప్రదాయ విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకోనుంది.

పెరిగే ఫీజుకు రాష్ట్ర ప్రభుత్వం బోధనా రుసుం చెల్లించదు. దాన్ని విద్యార్థులే చెల్లించాలి. అయితే పెంచిన మొత్తాన్ని వసూలు చేసుకోవడం, చేయకపోవడం ఆయా కళాశాలల ఇష్టానికే వదిలేస్తారు. ప్రస్తుతం సగటున ఆయా కోర్సులను బట్టి రూ.6వేల నుంచి 14 వేల మధ్య రుసుములున్నాయి. వాటికి అదనంగా పై మొత్తాన్ని పెంచనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏటా 2.33 లక్షల మంది బీఏ, బీకాం, బీఎస్‌సీ, బీబీఏ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నారు.

Related posts