telugu navyamedia
రాశి ఫలాలు

ఫిబ్రవరి 13, ఆదివారం రాశిఫలాలు..

మేషరాశి…

వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్న‌నాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం క‌లుగుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. శత్రువులకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ‌స్తుల‌కు ఒత్తిడి త‌ప్ప‌దు

వృషభరాశి…

కుటుంబంలో సమస్యలు ఏర్ప‌డ‌తాయి. వృద్ధులకు సహాయం చేస్తారు. ధనం అధికంగా ఖ‌ర్చు అవుతుంది. మిత్రుల నుంచి ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు మంద‌గిస్తాయి. ఉద్యోగాల‌లో వివాదాలు కొల‌క్కి వ‌స్తాయి.

మిథునరాశి…

పరిస్థితులు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు గ‌డిస్తారు. స్రీల‌కు వ‌స్తు, వస్త్రలాభాలు క‌లుగుతాయి. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు అంత‌గా క‌లిసిరావు. నిరోద్యోగుల‌కు ఉద్యోగ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి.

కర్కాటకరాశి..

అనుకోని దూరప్రయాణాలు చేస్తారు. బండి న‌డిపేట‌ప్పుడు అప్రమత్తంగా ఉండడం మంచిది. మిత్రులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. భాగ‌స్వామ్య వ్యాపారాల్లో ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. విద్యార్థులు తమ చదువుల గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగాలలో కొత్త సమస్యలు త‌లెత్తుతాయి.

సింహరాశి…

నిరుద్యోగులుకు ఉద్యోగ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. రాజకీయ రంగానికి సంబంధించిన వ్యక్తులు లాభపడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు మరింత మెరుగ్గా ఉంటాయి. స్రీల‌కు అధిక ఒత్తిడితో ఆనారోగ్యం బారిన ప‌డే సూచ‌న‌.

కన్య రాశి…

సోదరులతో సఖ్యత ఏర్ప‌డుతుంది. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు జాగ్రత్తగా ఆలోచించం మంచిది. అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు మొద‌ల‌వుతాయి.

తులరాశి..

వృత్తి, వ్యాపార‌స్తుల‌కు మంచి ఫలితాలు అందుకుంటారు. మిత్రుల నుంచి కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్య వ్యవహారాలు నిదానిస్తాయి. శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితం అందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తుల‌కుప్ర‌మోష‌న్స్ వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

వృశ్చికరాశి…

అధిక ఖర్చులతో ఆర్ధిక ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం క‌నిపిస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో సమస్య ఉంటుంది. దూరప్రయాణాలు చేస్తారు. సోదరులతో కలహాలు ఏర్ప‌డ‌తాయి. అనారోగ్యం సూచ‌న క‌నిపిస్తుంది. వ్యాపారాలు చికాకులు త‌ప్ప‌వు.

ధనుస్సురాశి…

పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో మీ హోదా పెరుగుతుంది. వైవాహిక బంధం బలపడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు వింటారు. వాహనయోగం క‌లుగుతుంది. వ్యాపారస్తులు సమస్యల నుంచి బయటపడతారు. బంధు, మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

మకరరాశి…

కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. సంఘంలో గౌర‌వ మ‌ర్యాద‌లు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను క‌లుసుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు సాఫిగా సాగుతాయి. ఉద్యోగస్తుల‌కు ఒత్తిడులు తొలగుతాయి.

కుంభరాశి…

ఆఫీసులో కలిసి పనిచేసే తొటివారితో మంచి అనుబంధం ఏర్ప‌డుతుంది. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు ఏర్ప‌డ‌తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. పనుల్లో జాప్యం ఏర్ప‌డుతుంది. ఆరోగ్యభంగం క‌లుగుతుంది. వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి.

మీనరాశి…

కుటుంబ స‌భ్యుల‌తో స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వ‌స్తాయి. ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యం సూచ‌న. దూరప్రయాణాల్లో మెలుక‌వ అవ‌స‌రం. వ్యాపారాలలో ఇబ్బందులు త‌లెత్తుతాయి. పిల్ల‌ల‌తో స‌ర‌దాగా గ‌డుపుతారు.

Related posts