telugu navyamedia
రాశి ఫలాలు

ఫిబ్రవరి 12, శనివారం రాశిఫలాలు

మేషరాశి

సంఘంలో గౌరవం, పలుకుబడి పెరుగుతుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. శత్రువులకు దూరంగా ఉండడం మంచిది. వ‌స్తు, వాహనయోగం క‌లుగుతుంది. కీలక నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలలో క‌లిసివ‌స్తాయి.

వృషభరాశి..

వాహ‌నం న‌డిపిన‌ప్ప‌డు జాగ్ర‌త్త వ‌హించ మంచిది. అనుకోని ప్రయాణాలు చేస్తారు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. మిత్రుల నుంచి ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగ‌స్తుల‌కు కాస్త చికాకులు త‌ప్ప‌వు. ఆరోగ్యంపై జాగ్ర‌త్త వ‌హించ‌డం మంచిది.

మిథునరాశి..

నూత‌న కార్యాల‌కు శ్రీకారం చుడ‌తారు బంధువుల రాక‌తో ఇల్లు సంద‌డిగా మారుతుంది. విందువినోదాలు పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. దైవ‌ద‌ర్శ‌నాలు చేస్తారు.

కర్కాటకరాశి..

ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. మీరు తలపెట్టిన పనులకు మీ జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. బంధువులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. అనారోగ్యం సూచ‌న‌. విద్యార్ధులు విజ‌యం సాధిస్తారు.

సింహరాశి..

అనుకోని ఆర్థిక లాభాలు. ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులు పూర్తిచేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగులకు అనుకూలం. ఆల‌యాలు సంద‌ర్శిస్తారు.

కన్యరాశి..

ఆత్మీయులతో సఖ్యత ఏర్ప‌డుతుంది. విలువైన వస్తువులు కొంటారు. అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు విస్త‌రిస్తారు. ఉద్యోగస్తుల‌కు ఆఫీసుల్లో అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

తులరాశి..

వ్యాపారాలు మందగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థికంగా సానుకూల పరిస్థితులున్నాయిమిత్రుల నుంచి ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారాలలో చికాకులు ఏర్ప‌డ‌తాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.

వృశ్చికరాశి..

పెద్దలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వ‌హించ‌డం మంచిది. ముఖ్య‌మైన‌ కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు చేస్తారు. రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం క‌లుగుతుంది. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల పట్ల శ్రద్ధ వహిస్తారు.

ధనుస్సురాశి..

కొత్త మిత్రుల పరిచయం ఏర్ప‌డుతుంది. ఇంట్లో శుభవార్తలు వింటారు. అనుకోని ధనలాభం. నిరోద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార‌స్తుల‌కు చిక్కులు తొలగుతాయి. బంధు, మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

మకరరాశి..

ఉద్యోగయత్నాలు ఫ‌లిస్తాయి. చిన్ననాటి మిత్రులను క‌లిసి స‌ర‌దాగా గ‌డుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ప్ర‌భుత్వ ఉద్యోగులు ఉన్నస్థితికి వెళ‌తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

కుంభరాశి..

కుటుంబంలో చికాకులు ఏర్ప‌డ‌తాయి. పనుల్లో జాప్యం క‌లుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగ‌స్తుల‌కు నిరాశ క‌లుగుతుంది.అనవసరంగా ఖర్చులు పెట్టకండి. దైవ‌ద‌ర్శ‌నాలు చేస్తారు.

మీనరాశి..

కొన్ని ముఖ్య‌మైన‌ వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువుల రాకవల్ల అసౌక‌ర్యం క‌లిగిస్తుంది. శ్రమాధికం. మిత్రులతో స్వల్ప వివాదాలు. అనుకోని ఖర్చులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి.

Related posts