telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

నేను గే కాదు… : ఆసీస్ క్రికెటర్ ఫాల్కనర్

Faulkner

తాను స్వలింగ సంపర్కుడని (గే) సోమవారం రాత్రి ఇన్‌స్టగ్రమ్‌లో పోస్ట్ పెట్టిన ఆస్ట్రేలియా క్రికెటర్‌ జేమ్స్‌ ఫాల్క్‌నర్‌ కొద్ది గంటల్లోనే గే కాదంటూ మరో పోస్ట్ పెట్టాడు. ఆదివారం 29వ పుట్టినరోజు జరుపుకొన్న సందర్భంగా ఫాల్క్‌నర్‌ తన బాయ్‌ఫ్రెండ్, తల్లితో కలిసి ఉన్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశాడు. బాయ్‌ఫ్రెండ్‌తో బర్త్‌డే డిన్నర్‌ అంటూ రాబర్ట్‌తో కలిసున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో వెల్లడించడంతో ప్రతి ఒక్కరూ తనను అపార్థం చేసుకున్నారని ఫాల్క్‌నర్ వివరణ ఇచ్చాడు. రాబర్ట్ తనకు స్నేహితుడు మాత్రమే అని చెప్పాడు. తాను గే అనుకుని ఎన్నో ట్రాన్స్‌జెండర్ సంఘాలు తనకు మద్దతు పలకడంపై ఫాల్క్‌నర్ ఆనందం వ్యక్తం చేశాడు. బౌలింగ్‌ ఆల్‌రౌండరైన ఫాల్క్‌నర్‌ ఆసీస్‌కు ఓ టెస్టు, 69 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించాడు. అతను 2017 అక్టోబరులో చివరి మ్యాచ్‌ ఆడాడు.

Related posts