telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

జకార్తా : ..పబ్జీ పై ఫత్వా జారీ..

hyderabadi school student died on pubg

పబ్జీ గేమ్‌పై ఇండోనేషియాకు చెందిన ఓ ముస్లిం సంస్థ మతపరమైన శాసనం(ఫత్వా) చేసింది. పబ్జీ గేమ్ ఇస్లాం మతాన్ని కించపరిచే విధంగా ఉందని, అంతేకాకుండా మనుషులను క్రూరంగా మారుస్తోందని సంస్థ ఆరోపించింది. ఇండోనేషియాలో శక్తిమంతమైన ఉలెమా కౌన్సిల్ ఈ ఫత్వాను జారీ చేసింది. పబ్జీ గేమ్ ఎవరూ ఆడొద్దని కౌన్సిల్ సభ్యులు స్థానికులను కోరుతున్నారు.

ప్రభుత్వం వెంటనే ఈ గేమ్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఫత్వా ప్రకారం పబ్జీ.. తదితర క్రూరమైన గేమ్‌లు ఆడటం నిషేధమన్నారు. ఇప్పటికే పబ్జీ గేమ్‌ ఆడటాన్ని గుజరాత్, నేపాల్ నిషేధించాయి. ఇప్పటివరకు ఈ గేమ్‌ను ప్రపంచవ్యాప్తంగా 36 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.

Related posts