telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

తల్లి కళ్ళముందే రెండేళ్ల కొడుకు తలను పేల్చేసిన తండ్రి

అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన 32 ఏళ్ల మైకేల్ గ్లాన్స్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోయిన మంగళవారం భార్యతో గొడవపడిన అతను.. చేతిలోని ఓ తుపాకీ తీసి వారి రెండేళ్ల కొడుకు తలను పేల్చేయబోయాడు. అదృష్టవశాత్తూ ఆ తుపాకీ పేలకపోవడంతో.. మైకేల్ భార్య కొడుకుని తీసుకొని బయటకు పరుగుతీసింది. కారు వెనుక సీటులో కొడుకు రైకర్‌ను ఉంచి, తాను ముందు సీట్లో కూర్చుంది. ఇంతో ఇంట్లో నుంచి ఓ షాట్‌గన్ తీసుకొని వచ్చిన మైకేల్.. దాంతో పిల్లాడి మొహంపై కాల్చిపారేశాడు. ఈ ఘటనలో పసివాడి మొహం సగం వరకూ పేలిపోయింది. తీవ్రంగా గాయపడిన పిల్లాడిని తల్లి నికోల్ ఆస్పత్రికి తరలించింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే మైకేల్‌ను అరెస్టు చేశారు.

Related posts