telugu navyamedia
క్రైమ్ వార్తలు

కన్న కూతురిని చితకబాదిన తండ్రి .. వైరల్‌

పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే నరరూప రాక్షసుడయ్యాడు. ముక్కుపచ్చలారని చిన్నారికి నరకం చూపిండు. తల్లి లేని కూతురిని కంటికి రెప్పలా కాచుకోవాల్సిన తండ్రి అదే కూతురిపై కర్కశంగా ప్రవర్తించాడు. పొడవాటి తాడుతో ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. వీపులో కొట్టాడు . చెంపలు చెళ్లుమనిపించాడు. చిన్నారిపై ప్రతాపం చూపించి పైశాచిక ఆనందం పొందాడు. ఇదంతా కూతురు అన్నం తినడం లేదని తండ్రి సైకోలా వ్యవహారించాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనను స్థానికులు కొందరు సెల్‌ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

ఈ అమానుష ఘటన మెదక్‌ జిల్లాలో చోటుచేసుకుంది. నాగరాజు అనే వ్యక్తి మెదక్‌ మున్సిపల్‌లో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మొదటి భార్యను వదిలేసి రెండో భార్యతో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో రెండో భార్య ఎదుట మొదటి భార్య మూడేళ్ల కూతురిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. చిన్నారిని చితకబాదుతూ పైశాచిక ఆనందం పొందాడు. ఈ దృశ్యాలను వీడియోలో చిత్రీకరించగా.. ఆలనా పాలనా చూసుకోవాల్సిన తండ్రే కూతురిని కొడుతుంటే ఆ చిన్నారి పడిన బాధ కంటతడి పెట్టిస్తోంది. ఆ ప్రబుద్దుడిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కనికరం లేని ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నంత వరకు పిల్లలకు భరోసా ఉండదని వాపోతున్నారు.

Related posts