telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు సామాజిక

పది పాసైన .. తండ్రి కూతుళ్లు.. పలువురి శుభాకాంక్షలు..

father and daughter passed ssc same time

ఇల్లాలు చదువుకుంటే.. ఇంటిల్లిపాది చదువుకున్నట్టే అన్నది అప్పటి మాట, కూతురు చదువుకుంటే.. ఇంటిల్లిపాది చదువుకున్నట్టే ఇది నేటి మాట. ఎదిగొచ్చిన బిడ్డ ఉంటే ఎంత లాభమో ఆ తండ్రికి తెలిసొచ్చింది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందాలంటే, పదో తరగతి పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాల్సిన ఓ తండ్రి, తన కుమార్తె ఇచ్చిన శిక్షణతో పరీక్ష పాసై, ఆ ఆనందాన్ని ఇప్పుడు అందరితో పంచుకుంటున్నారు. ఈ ఘటన పుదుచ్చేరిలోని కూడపాక్కం ప్రాంతంలో జరిగింది. 7వ తరగతి వరకూ మాత్రమే చదువుకున్న సుబ్రహ్మణ్యం (45) ప్రభుత్వ ఉద్యోగమైతే సంపాదించుకున్నాడు గానీ, ప్రమోషన్ మాత్రం పొందలేకపోయాడు.

ఆయన 2017లో ప్రమోషన్ కోసం మరింత చదవాలని భావించి ఎనిమిదో తరగతి పాస్ అయ్యాడు. ఆపై టెన్త్ రాయగా, మూడు సబ్జెక్టులు పోయాయి. ఆపై సప్లిమెంటరీ రాస్తే, రెండు సబ్జెక్టులు మిగిలాయి. ఇక తనకు చదువు అచ్చిరాదనుకున్న ఆయనకు, కుమార్తె రూపంలో వరం లభించింది. సుబ్రహ్మణ్యం కుమార్తె త్రిగుణ పదో తరగతి చదువుకుంటూ, తండ్రి పాస్ కావాల్సిన ఆంగ్లం, గణితంలో ఇంట్లోనే ట్యూషన్ చెప్పింది. ఆపై కుమార్తెతో కలిసి సుబ్రహ్మణ్యం కూడా పరీక్ష రాశారు. సోమవారం నాడు ఫలితాలు రాగా, ఇద్దరూ ఉత్తీర్ణత సాధించారు. ఇప్పుడా తండ్రీ బిడ్డలను పలువురు అభినందిస్తున్నారు.

Related posts