telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

కొడుక్కి ఫోన్ ఇచ్చి.. దొరికిపోయిన తండ్రి.. ఎఫైర్ ..

SIT Investigation YS viveka Murder

అసలు కంటే కొసరు ముద్దని, కొన్నిసార్లు అవసరం తిరకున్నా మేలు జరుగుతుంటుంది. అలా కొడుకు అడిగాడని తండ్రి తన మొబైల్ ఇచ్చాడు..దానితో ఆ తండ్రి అక్రమ బాగోతం తల్లికి తెలియజేశాడు ఆ కొడుకు. నగరానికి చెందిన 43 ఏళ్ల నాగరాజన్ ఓ స్వచ్ఛంద సేవా సంస్థ యజమాని. నాగరాజన్ భార్య స్థానికంగా ఓ స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది. వారికి 14 ఏళ్ల టీనేజ్ కుమారుడు ఉన్నాడు. అయితే ఒకరోజు నాగరాజన్ తన ఫోన్ ను కొడుకు అడగడంతో ఇచ్చాడు. ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుతున్న ఆ కుర్రాడు పొరబాటున ఆడియో రికార్డర్ ఆన్ చేశాడు. అందులో రికార్డయిన కొన్ని ఆడియోలు ఆ టీనేజ్ బాలుడ్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి.

ఆ ఆడియో లో ఉన్న సంగతుల విషయానికి వస్తే, తన తండ్రి మరో మహిళతో అత్యంత సన్నిహితంగా మాట్లాడిన మాటలు అందులో రికార్డయి ఉన్నాయి. వాట్సాప్ చాటింగ్ లోనూ కొన్ని సంభాషణలు బయటపడ్డాయి. ఈ కుర్రాడు వెంటనే వాటిని తన తల్లికి చూపించాడు. తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆ ఇల్లాలు తెలుసుకుంది. భర్తను నిలదీయడంతో, ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఈ నేపథ్యంలో, ఆ స్కూల్ టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్రమ వ్యవహారం గురించి కుటుంబ సభ్యులకు చెబితే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని బెదిరిస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. స్టేషన్ బయటే రాజీ చేసుకునేందుకు నాగరాజన్ కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Related posts