telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

పాఠశాల ఆవరణలోనే … సేద్యం.. పౌష్టికాహారానికి ..

farming in schools to give right diet

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు రుచికరమైన సేంద్రియ కూరగాయాలను అందించాలనే ఉద్దేశ్యంతో సొంతంగా పాఠశాలలో ఉన్న స్థలంలో కూరగాయాలను పండిస్తూ మధ్యాహ్న భోజనానికి వినియోగిస్తున్నారు. కందుకూరు మండలం ముచ్చర్ల ప్రభుత్వ పాఠశాలలో ప్రతి శనివారం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా ముందుకు వచ్చి కలుపు తీస్తూ కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పాఠశాలకు వెళ్లే తమ పిల్లలకు చక్కటి విద్యాబోధన అందిస్తే చాలు అనుకుంటారు తల్లితండ్రులు. అదే విద్యాబోధనతో పాటు తాజా కూరగాయాలతో భోజనం పెడితే అంతకంటే కావాల్సింది ఏముంటుంది. కందుకూరు మండలం ముచ్చర్ల కేంద్ర పాఠశాల ఉపాధ్యాయులు అటు చదువు చెబుతూ, ఇటూ రుచికర భోజనం పెడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ పాఠశాలలో చదివే విద్యార్థులకు తాజా కూరగాయాలతో మధ్యాహ్న భోజనాన్ని అందించే ఉద్దేశ్యంతో కూరగాయాలు, ఆకుకూరల పంటల సాగును ప్రారంభించారు.

ఉపాధ్యాయులు వర్షాధారంగా వచ్చిన వివిధ రకాల కూరగాయాలను (పాలకూర, పుంటికూర, తోటకూర, టమాట, పచ్చిమిర్చి, వంకాయ, బెండకాయ, బీర, దోస, కరివేపాకు) సాగు చేయగా అవన్నీ కాపునకు వచ్చాయి. వాటినే మధ్యాహ్న భోజనంలో వినియోగిస్తున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు పాఠశాల ప్రారంభంలోనే ఆవరణంతా దున్నీ పశువుల ఎరువులను వేసి భూమిని సారవంతం చేశారు. వర్షాలు కురిసిన వెంటనే పంటలను సాగు చేశారు. ఆకు కూరలతో పాటు కూరగాయాలను కోసి కూరలు వండుతున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో కూరగాయాలు కొనుగోలు చేసి మధ్యాహ్న భోజనం పెట్టడం సవాల్‌గా మారింది. నీళ్ల చారు, పప్పు మాత్రమే దిక్కవుతున్నాయి. ఈ తరుణంలో పాఠశాలలో పంటలు పండిస్తే వాటిని వినియోగించుకోవచ్చని ధరలు పెరిగినా ఇబ్బంది లేకుండా మంచి ఆహారం విద్యార్థులకు అందించేందుకు వీలుంటుంది ఉపాధ్యాయులు తెలుపుతున్నారు.

Related posts