telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

కొడుకు తలకు తుపాకీ గురిపెట్టి… 13 ఏళ్ల కూతురు ముందు తల్లిపై రాక్షసుడి అత్యాచారం…!

Simane

సడెన్‌గా కిటికీ అద్దాలు పగలడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఆ కుటుంబం మొత్తం. ఆ వెంటనే తుపాకీ నుంచి వచ్చిన ఆ గుండును చిన్న కొడుకు తృటిలో తప్పించుకోగా… అతనికి తగలాల్సిన తూటా అంగుళం తేడాతో వచ్చి ఆమె కడుపులో దిగబడింది. ఆమె తేరుకునే లోపే… కిటికీలోంచి ఇంట్లోకి ప్రవేశించాడు సెబెన్‌జైల్ సిమానే అనే వ్యక్తి. తుపాకీ చూపించి వారందరినీ ఇనుప వైర్లతో బలంగా కట్టేశాడు. ‘మీ నాన్న నన్ను మోసం చేశాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే మీ కళ్ల ముందే వాణ్ణి ముక్కలుగా నరికేస్తా’ అంటూ పిల్లలకు చెప్పాడు. అనంతరం తుపాకీ గాయంతో రక్తమోడుతున్న పిల్లల తల్లి దుస్తులన్నీ చింపేసి.. ఆమె చిన్న కుమారుడి తలపై తుపాకీ పెట్టి ఆమెను బలాత్కరించాడు. ఆమెకు తూటా తగిలిన గాయం నుంచి విపరీతంగా రక్తం కారుతున్నా కూడా పట్టించుకోకుండా ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ తర్వాత పదమూడేళ్ల ఆమె కూతుర్ని తీసుకొచ్చి బలాత్కరించబోయాడు. తన కూతుర్ని వదిలేయమని ప్రాధేయపడడంతో కన్న కూతురి కళ్లముందే ఆమెను బలవంతంగా అనుభవించాడు.

తన భర్త ఊర్లో లేడని అతనికి చెప్పి, తన ఏటీయం కార్డులు, వాటి పిన్ నంబర్లు అతనికి ఇచ్చింది. కారులో ఊరిబయటకు తీసుకెళ్లి వదిలేయాలని అతను ఆల్టిమేటం జారీచేశాడు. దానికి కూడా అంగీకరించిన ఆమె అతను చెప్పినట్లే కారులో అతన్ని తీసుకెళ్లింది. ఊరి బయట మళ్లీ ఆమెను బలాత్కరించడానికి అతను ప్రయత్నించాడు. అయితే తన గాయం నుంచి రక్తం తీవ్రంగా పోయిందని, మళ్లీ తనపై అత్యాచారం చేస్తే కచ్చితంగా తాను చనిపోతానని ఆమె చెప్పింది. తనను వదిలేయాలని ప్రార్థించింది. అతను కారు దిగగానే హుటాహుటిన ఇంటికి వచ్చింది. అప్పటికే పిల్లలు తమ బంధనాల నుంచి తప్పించుకొని పొరుగింటి వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుసుకొంది. అక్కడకు వచ్చిన అంబులెన్సులో ఆస్పత్రికి చేరుకొని చికిత్స చేయించుకుంది. గత ఏడాది సౌతాఫ్రికాలో ఈ ఘటన జరిగింది. ఆ రాత్రి తమకు కాళరాత్రి వంటిదన్న ఆమె.. మళ్లీ ఆ ఇంట్లో ఉండలేకపోయామని చెప్పింది. 32 ఏళ్ల సెబాన్‌జైల్ సిమానేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణ చేసిన కోర్టు అతనికి రెండు యావజ్జీవ కారాగార శిక్షలతో పాటు, 137 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ తాజాగా తీర్పునిచ్చింది.

Related posts