telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

100వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళన…బీజేపీపై పోటీకి సిద్ధమైన రైతులు !

దేశ రాజధాని సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది.. ఎన్ని అడ్డుంకులు ఎదురైనా, నిర్భందం తీవ్రతరం అవుతున్నా.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా సుదీర్ఘంగా ఆందోళన చేస్తున్నారు. ఇక, ఓవైపు చర్చలకు సిద్ధమంటూనే.. కేంద్రం సరైన రీతిలో స్పందించకపోవడంతో.. ఆందోళన మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. అయితే..ఈ రైతుల ఆందోళన నేటికి 100వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రాజస్థాన్ సరిహద్దుల్లో “కుండ్లి-మనేసర్-పల్వాల్ ఎక్స్ ప్రెస్ వే” దిగ్బంధం చేశారు రైతులు. ఈ రోజు ప్రజలు ఇంటివద్ద నలజెండాలు ఎగురవేయాలని పిలుపు నిచ్చాయి రైతు సంఘాలు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీక్షా స్థలాల్లో మహిళలతో ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నాయి రైతు సంఘాలు. అలాగే ఈనెల 10న ట్రేడ్ యూనియన్లతో సమావేశం నిర్వహించనున్నారు. మార్చి 15న కార్మికులు, ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేయనున్నారు రైతులు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు రైతు బృందాలను పంపి భాజపా అభ్యర్థులను ఓడించేందుకు కృషి చేయాలని రైతు సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి.

Related posts