telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కేంద్రానికి అక్టోబర్ 2 వరకు సమయం ఇచ్చిన రైతులు…

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత రెండు నెల్ల నుండి రైతులు వివిధ పద్దతుల్లో నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో కేంద్రం ఎన్ని ప్రతిపాదనలు చేసినా.. చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తాం అని చెప్పినా.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా సుదీర్ఘంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.. అయితే, తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఇంటికి వెళ్లేలేదని స్పష్టం చేశారు భార‌తీయ కిసాన్ యూనియ‌న్ నేత రాకేశ్ టికైట్… రైతుల ఆందోళనలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు దేశవ్యాప్తంగా ‘చక్కా జామ్’ పేరుతో రాస్తారోకోలు నిర్వహించాయి రైతు సంఘాలు.. ఈ సందర్భంగా రాకేశ్ టికైట్ మాట్లాడుతూ.. చట్టాలను రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అక్టోబర్ 2వ తేదీ వరకు సమయం ఇస్తున్నాం.. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అక్టోబర్ 2 వరకు కేంద్రం ఆ చట్టాలను రద్దు చేయాలన్నారు. ఇక, ‘చక్కా జామ్’ నిరసనలను హింసాత్మకంగా మార్చడానికి కొందరు దుండగులు ప్రయత్నిస్తున్నట్టు తమ దగ్గర సమచారం ఉందన్నారు. అందుకే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో రోడ్డు దిగ్బంధం నిర్వహించలేదని తెలిపారు. అయితే ఈ రెండు రాష్ట్రాల్లోని రైతులను ఎప్పుడైనా దేశ రాజధానికి పిలవవచ్చని, వారిని స్టాండ్‌బై గా ఉంచామని తెలిపారు. చూడాలి మరి కేంద్రం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది.

Related posts