telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

నిజామాబాద్ లోక్ సభ వాయిదా వేయాలని రైతుల ఆందోళన

1000 farmers from nijamabad to parlament
తెలంగాణలోని నిజామాబాద్ లోక్ సభ సీటు నుంచి రికార్డు స్థాయిలో 185 మంది అభ్యర్థులు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. వీరిలో ఎక్కువ మంది రైతులే ఉన్నారు. పసుపు, ఎర్ర మొక్కజొన్న పంటలకు మద్దతు ధర దక్కకపోవడంపై నిరసనగా అన్నదాతలు  నామినేషన్లు వేశారు. ఎన్నికల గడువు సమీపించినా ఇంకా తమకు గుర్తులు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఓ పోలింగ్ అవగాహన కేంద్రం వద్ద రైతులు ఈరోజు ఆందోళనకు దిగారు. ఎన్నికలను 15 రోజుల పాటు వాయిదా వేయాలని కోరారు. 
ఎన్నికల అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న పోలీస్ ఉన్నతాధికారులు ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలవుతుందని రైతులకు తెలిపారు. ఇలాంటి సందర్భంలో ఆందోళనలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. దీంతో రైతులు ఆందోళనను విరమించారు. నిజామాబాద్ పార్లమెంట్ బరిలో టీఆర్ఎస్ నుంచి  కవిత, కాంగ్రెస్ నుంచి మధుయాష్కీ, బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ ఉన్నారు. 
 

Related posts