telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గవర్నర్ కు … ఏపీసీఎం ఘనంగా వీడ్కోలు ..

farewell to governor narasimhan by apcm

ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించిన నేపథ్యంలో నరసింహన్ కు వీడ్కోలు పలికారు సీఎం జగన్. మరోవైపున ఆయన ఎక్కడికీ పోవడం లేదు పక్కనే ఉన్నారన్న ఆనందమూ ఉందని సీఎం జగన్ అన్నారు. విజయవాడలో గవర్నర్ నరసింహన్ కు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, గవర్నర్ నరసింహన్ పది సంవత్సరాలుగా తనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి అని, తనకు తండ్రితో సమానమని, సలహాలు ఇస్తూ ఉండేవారని గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా ఏపీసీఎం మాట్లాడుతూ, గవర్నర్ నా చేయి పట్టుకుని నన్ను దగ్గరుండి నడిపించే కార్యక్రమం కూడా చేశారు. ఇంకా, మన గవర్నర్ గా కొనసాగి ఉన్నట్టయితే, నా చేయి పట్టుకుని ఈ ఐదు సంవత్సరాల పాటు నడిపించే ఒక మంచి అవకాశాన్ని మనం కోల్పోయామని చెప్పి మనసులో కొంచెం బాధ అనిపించినా, నిండు మనసుతో ఆయన ఆశీస్సులు మనకెప్పుడూ ఉంటాయని’ జగన్ ఆకాంక్షించారు. నరసింహన్ కు కూడా ఏపీ ప్రజలు, తమ తరపున ఆయన్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటామని, పెద్దాయన స్థానంలో ఆయన్ని ఙ్ఞాపకం చేసుకుంటామని అన్నారు.

నరసింహన్ మాట్లాడుతూ, తాను తెలిసో, తెలియకో తప్పులు చేసి ఉంటే క్షమించాలని కోరారు. విజయవాడలో నిర్వహించిన వీడ్కోలు సభలో నరసింహన్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఏపీ ప్రజలను తానెప్పటికీ మర్చిపోలేనన్నారు. తప్పులు చేసి ఉంటే క్షమించాలని కోరారు. తనకు సహకరించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీతో తనకు అవినాభావ సంబంధం ఉందన్న నరసింహన్.. 1951లో విజయవాడలోనే తనకు అక్షరాభ్యాసం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. పాలన అద్భుతంగా ఉందని కొనియాడారు. అసెంబ్లీలో జగన్ అనుసరిస్తున్న తీరు బాగుందని, చివరి వరకు ఇదే పంథా అనుసరించాలని కోరారు. నరసింహుడే ఏపీని రక్షిస్తాడని అన్నారు. తన సలహా మేరకే జగన్ మంగళగిరి నరసింహుణ్ని దర్శించుకున్నారని గవర్నర్ తెలిపారు. కొన్ని సందర్భాల్లో మితిమీరి జోక్యం చేసుకున్నందుకు జగన్ తనను క్షమించాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే అలా చేయాల్సి వచ్చిందని నరసింహన్ వివరించారు.

Related posts