telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

74వ వసంతంలోకి అడుగుపెట్టిన గానగంధర్వుడు… వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు

SPB

గాన గంధర్వుడు, లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్‌ ఎస్పీ బాల సుబ్ర‌హ్మ‌ణ్యం నేడు 74వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కి దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులు, స‌న్నిహితులు శుభాకాంక్ష‌లు అందిస్తున్నారు. 1 భార‌తీయ భాష‌ల్లో పాట‌లు పాడిన ఘ‌న‌త మన ఎస్‌పీది. ఇప్ప‌టికి 40వేలకు పైగా పాట‌లు పాడి రికార్డు సృష్టించారు బాలు. న‌టుడిగాను, సంగీత ద‌ర్శ‌కుడిగాను బాలు అల‌రించారు. ఈయ‌న అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం. చిన్నతనం నుంచే పాటలు పాడటం హాబీగా మార్చుకున్న బాలుకి.. తొలిసారిగా 1966లో విడుదలైన ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రంలో పాడే అవకాశం వచ్చింది. హీరోల‌కి త‌గ్గ‌ట్టు గొంతు మార్చి పాడ‌గ‌ల స‌త్తా బాలు సొంతం. ఘంట‌సాల తర్వాత మ‌ళ్లీ సంగీతానికి ఆరాధ్య‌దైవంగా నిలిచారు ఎస్పీబీ. కోట్లాదిమంది సంగీతాభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ నటులు తమ సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీరిలో కండలవీరుడు సల్మాన్, చిరంజీవితోపాటు చాలా మంది నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Related posts