telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

సామజ వరగమన .. చిత్రీకరణపై .. అభిమానుల అసంతృప్తి..

Allu-arjun

ఈమధ్య కాలంలో ఏ టాప్ హీరో మూవీ పాటకు రానంత ఆదరణ ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘సామజ వరగమన’ పాటకు వచ్చింది. ఈ మెలోడీ సాంగ్ ట్యూన్ విపరీతంగా నచ్చడంతో కోట్ల సంఖ్యతో ఈ పాటకు వ్యూస్ లక్షల సంఖ్యలో లైకులు వచ్చాయి. దీనితో ఈ అద్భుతమైన మెలోడి సాంగ్ కు త్రివిక్రమ్ తన క్రియేటివిటి జోడించి ఈపాటను మరింత అద్భుతంగా చూపెడతారని అందరూ భావించారు. అయితే అందరి ఊహలను తలక్రిందులు చేస్తూ ఈపాటను ప్యారిస్ లో అల్లు అర్జున్ పూజా హేగ్డేల పై చిత్రీకరిస్తున్నారు. ఈపాట లో పారిస్ కు చెందిన లిండో డ్యాన్సర్స్ ప్రత్యేకంగా కనిపించబోతున్నారు. ప్యారిస్ లో లిండో డ్యాన్స్ అంటే అమితంగా ఇష్టపడతారు. గత 30 ఏళ్లుగా లిండో డ్యాన్స్ తో ఆకట్టుకుంటున్న ఈ డ్యాన్సర్స్ సామజ వరగమన సాంగ్ కు ప్రత్యేక ఆకర్షణగా మారుతుందని త్రివిక్రమ్ ఒక కొత్త ప్రయోగం చేస్తున్నాడు.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుంచి వచ్చిన ఈ పాటకు లిండో డాన్సర్లతో ప్రయోగం ఏమిటి అంటూ కొంతమంది ఆశ్చర్య పోతున్నారు. గతంలో త్రివిక్రమ్ ఇలాగే ‘అజ్ఞాతవాసి’ మూవీలోని ‘బయటకొచ్చి చూస్తే’ పాట ఒక మెలోడీగా హిట్ అయితే ఆ పాటను పవన్ అనూ ఇమాన్యువల్ పై ఆ మెలోడీ అంతా పోగొట్టుకునే సాంగ్ గా చిత్రీకరించి ఆ పాటకు అన్యాయం చేసాడు అన్న కామెంట్స్ అప్పట్లో వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ గా త్రివిక్రమ్ సామజ వరగమన’ పాటకు లిండో డాన్సర్స్ చేత మాస్ స్టెప్స్ వేయించి ఆపాటను పాడు చేస్తున్నాడు అంటూ త్రివిక్రమ్ అభిమానులు కూడ కామెంట్స్ చేస్తున్నారు. ఒక మెలోడీ పాటకు మాస్ క్రియేటివిటీ జోడించాలి అన్న ఆలోచన త్రివిక్రమ్ కు ఎందుకు వచ్చిందో అర్ధంకాని విషయంగా మారింది.

Related posts