telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రనుమండల్ పై లతా మంగేష్కర్ వ్యాఖ్యలు… హిమేష్ రేష్మియా మద్ధతు

Ranu-Mondal

ఒక్క పాటతో సూపర్ సెలిబ్రెటీ స్థాయినందుకున్న రనుమండల్ ‌దశ తిరిగిపోయింది. కోల్‌క‌త్తా రైల్వే స్టేషన్ వద్ద “ఏక్ ప్యార్ క నగ్మా హై” అని రను పాడిన పాటను ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు గాయకుడైన హిమేష్ రేష్మియా తాను కంపోజ్ చేస్తున్న “తేరీ మేరీ కహాని” సినిమాలో గాయనిగా ఆఫర్ ఇచ్చాడు. ఆమెతో కలిసి డ్యూయట్ కూడా పాడాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే లెజెండరీ గాయని లతా మంగేష్కర్ పాడిన “ఏక్ ప్యార్ నగ్మా హై” అనే పాట పాడిన రనుమండల్ ఓవ‌ర్ నైట్ సెల‌బ్రిటీ కావ‌డంతో పాటు అనేక అవ‌కాశాలు ద‌క్కించుకుంటుండ‌గా, లెజండ‌రీ సింగ‌ర్ లతా మంగేష్క‌ర్ మాత్రం ఆమెని త‌ప్పు పడుతోంది. ఈ సందర్భంగా లతా మంగేష్కర్ మాట్లాడుతూ “నా పేరు వాడుకొని బాగుప‌డితే అది అదృష్టంగా భావిస్తాను. అంతేకాని అనుక‌రించి పేరు తెచ్చుకుంటే అది ప్ర‌తిభ అనిపించుకోదు. రణు మొండల్‌ నేను పాడిన పాట‌ని అనుక‌రించి చాలా పాపుల‌ర్ అయింది. ఈ విజ‌యం కేవ‌లం కొద్ది రోజుల వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం” అంటూ ల‌తామంగేష్క‌ర్ వ్యాఖ్యానించారు. తాజాగా లతా మంగేష్కర్‌పై వెల్లువెత్తుతున్న విమర్శలపై హిమేశ్ స్పందించాడు. లతాజీ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నాడు. ఒక సింగర్‌ను కాపీ కొట్టడం వల్ల ఉపయోగం ఉండదని, కానీ వారి నుంచి ఎంత స్ఫూర్తి పొందామన్నదే ముఖ్యమని పేర్కొన్నాడు. తనకు కిషోర్ కుమార్ స్ఫూర్తి అని కుమార్ సాను ఎప్పుడూ చెబుతుంటారని ఈ సందర్భంగా హిమేశ్ గుర్తు చేశాడు. అందరం కూడా ఎవరో ఒకరి నుంచి స్ఫూర్తి పొందుతూనే ఉంటామన్నాడు. తాను పాడినప్పుడు కూడా చాలామంది విమర్శించేవారని, ముక్కుతో హైపిచ్‌లో పాడుతున్నానని అనేవారని, కానీ అంతర్జాతీయంగా చూస్తే ఇప్పుడది చాలా సాధారణం అయిపోయిందని వివరించాడు. తన రాబోయే సినిమా ‘హ్యాపీ హర్డీ అండ్ హీర్’ సినిమాలోని పాటను లాంచ్ చేసిన సందర్భంగా రనుమండల్ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ హిమేశ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

Related posts