telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

విశాఖ తీరానికి 670 కి.మీ. దూరంలో ఫణి..

rainy situations to telugu states

ఫణి తుఫాన్ తీవ్ర తుఫాన్‌గా మారిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్రపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇది విశాఖ తీరానికి 670 కిలో మీటర్లు, పూరి తీరానికి 830 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రేపు ఇది మరింత బలపడి పెను తుపానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఓడరేవులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో, కాకినాడ, గంగవరం రేవుల్లో ఐదో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మచిలీపట్నం, విశాఖపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో నంబర్ హెచ్చరికలు జారీ చేశారు. రేపటి నుంచి 4వ తేదీ వరకు తుపాను ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Related posts